మహేష్ బాబు నటించాల్సిన సినిమా లో అలీ హీరో అయ్యాడు

మహేష్ బాబు నటించాల్సిన సినిమా లో అలీ హీరో అయ్యాడు
x
Highlights

అలీ టాలీవుడ్లోని స్టార్ కమెడియన్లలో ఒకడు. ఈ మధ్యకాలంలో అలికి ఆఫర్లు తగ్గినప్పటికీ టీవీ షోల ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. 1994లో అలీ సోషియో...

అలీ టాలీవుడ్లోని స్టార్ కమెడియన్లలో ఒకడు. ఈ మధ్యకాలంలో అలికి ఆఫర్లు తగ్గినప్పటికీ టీవీ షోల ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. 1994లో అలీ సోషియో ఫాంటసీ డ్రామా అయిన 'యమలీల' సినిమాతో హీరోగా మారాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అప్పటివరకు కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అలీ ఆ సినిమాతో హీరోగా కూడా మంచి ఇమేజ్ ను టాలీవుడ్ లో ఏర్పరుచుకున్నాడు. ఎస్ వి కృష్ణారెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ముందుగా అలీని ఈ సినిమాలో హీరో గా పెట్టుకుందామని అనుకోలేదట.

ఈమధ్యనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన పూర్తిచేసుకున్న అలీ ఈ విషయాన్ని బయట పెట్టాడు. ఈ సినిమాలో ఎస్.వి.కృష్ణారెడ్డి ముందుగా మహేష్ బాబును హీరోగా పెడదామనుకున్నారట. హైదరాబాద్ నుంచి మద్రాస్ ఫ్లైట్లో వెళుతున్నప్పుడు ఎస్.వి.కృష్ణారెడ్డి మహేష్ కు ఈ స్క్రిప్ట్ కూడా నెరేట్ చేశాడట. కానీ అప్పటికి హీరో అవ్వని మహేష్ బాబు ఇంకా చదువుతూనే బిజీగా ఉన్నాడట. అందుకని ఎస్ వి కృష్ణారెడ్డి అలీతో ఈ సినిమాను తీశారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమాతో మహేష్ ఎంట్రీ ఇచ్చి ఉంటే ఎలా ఉండేదో..

Show Full Article
Print Article
Next Story
More Stories