మహేష్ బాబు సినిమా తో సంతోషపడిన పవన్ కళ్యాణ్ అభిమానులు

Mahesh Babu Used Pawan Kalyan Reference | Telugu News
x

మహేష్ బాబు సినిమా తో సంతోషపడిన పవన్ కళ్యాణ్ అభిమానులు

Highlights

*మహేష్ బాబు సినిమా తో సంతోషపడిన పవన్ కళ్యాణ్ అభిమానులు

Pawan Kalyan Fans: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో భారీ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. చాలా మంది యువ హీరోలు తమ సినిమాలలో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ను పెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఒక స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ తీసుకోవటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు ఇద్దరు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలే.

ఇద్దరు దాదాపు సమానమైన స్టార్ డం ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ మహేష్ బాబు తాను నటించిన "సర్కారు వారి పాట" సినిమాలో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ తీసుకున్నారు. ఈ సినిమాలో సుబ్బరాజు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సుబ్బరాజు ఫోన్ రింగ్టోన్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "భీమ్లా నాయక్" సినిమా లోని "లా లా భీమ్లా" పాట. ఈ రింగ్టోన్ సినిమాలో ఒకటి కాదు రెండు సార్లు వినిపిస్తుంది.

మహేష్ బాబు సినిమాలో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ వినగానే అభిమానులు షాక్ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించారు. సముతురఖని, వెన్నెల కిషోర్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories