పవన్ కళ్యాణ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి- మహేష్

Mahesh Babu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కరోనా నిర్థారణ కావడంతో ఆయన అభిమానలు ఆందోళనకు గురవుతున్న సంగతి తెలిసిందే.

Samba Siva Rao
Published on: 17 April 2021 5:50 PM IST
mahesh babu Tweet On Pawan Kalyan
X

పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు 

Mahesh Babu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కరోనా నిర్థారణ కావడంతో ఆయన అభిమానలు ఆందోళనకు గురవుతున్న సంగతి తెలిసిందే. రెండ్రోజులక్రితం కోవిడ్ పరీక్షలు చేయించుకున్న పవన్‌‌కు కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు. దాంతో, పవన్ కల్యాణ్ హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. పవన్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని.. మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసారు.

ఎప్పటిలాగే సినిమాలతో ప్రేక్షకులను అలరించాలంటూ ట్వీట్ చేసారు. తాజాగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఆ మధ్య 'వకీల్ సాబ్' సినిమా చూసి మహేష్ బాబు అభినందించిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఒక్కరిని వదిలి పెట్టడం లేదు. టాలీవుడ్ లో పలువురి ప్రముఖులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రుగా ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. పవన్ కళ్యాణ్‌కు కరోనా సోకడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

పవన్‌ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తోపాటు నిమ్ము చేరడంతో ఆక్సిజన్ అందిస్తూ ప్రత్యేక వైద్య బృందం ట్రీట్‌మెంట్ అందిస్తోంది. ఇక, పవన్ జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పవన్ ఫామ్‌హౌస్‌లో‌ చికిత్స జరుగుతోంది. ఈనెల 3న తిరుపతి సభ తర్వాత పవన్‌ అస్వస్థతకు గురికావడంతో కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అయితే, అప్పుడు కరోనా నెగిటివ్ రావడంతో ముందుజాగ్రత్తగా అప్పట్నుంచి హోమ్ క్వారంటైన్‌లో ఉంటూ వచ్చారు. అయితే, జ్వరం, ఒళ్లు నొప్పులు ఉండటంతో రెండ్రోజులక్రితం మరోసారి కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఈసారి పాజిటివ్ రావడంతో వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story