త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఆలస్యం అవడానికి కారణం మహేష్ బాబా?

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఆలస్యం అవడానికి కారణం మహేష్ బాబా?

Rama Rao
Published on: 1 Nov 2022 8:32 AM IST
Mahesh Babu & Trivikram Srinivas Film is Delayed Reason | Tollywood News
X

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఆలస్యం అవడానికి కారణం మహేష్ బాబా?

Mahesh Babu Film: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా వంటి సూపర్ హిట్ సినిమాలు తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న రెండవ సినిమా ఇది. పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రకటించి ఇప్పటికీ చాలాకాలం అయినప్పటికీ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా మొదలవలేదు.

వచ్చే ఈడది సమ్మర్లో విడుదలకు కావాల్సిన సినిమా ఆగస్టు కి వాయిదా పడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే సినిమా మరింత వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం దీనికి కారణం మహేష్ బాబు అని తెలుస్తోంది. త్రివిక్రమ్ స్క్రిప్ట్ మహేష్ బాబుకి అంతగా నచ్చలేదని ఎప్పటికప్పుడు మార్పులు చెబుతూ వచ్చారు.

డైలాగ్ వెర్షన్ తో సహా మొత్తం స్క్రిప్ట్ ని మార్చమని మహేష్ బాబు చాలానే చేంజెస్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. సినిమా లో అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకుంటున్నా మహేష్ బాబు సినిమా మీద అతి జాగ్రత్త తీసుకుంటున్నారేమో అని కొందరు అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మహేష్ బాబు కారణంగానే షూటింగ్ ఆలస్యం అయిందని సమాచారం.

Rama Rao

Rama Rao

Next Story