Mahesh Babu Trivikram Movie: రా ఏజెంట్ గా మహేష్ బాబు?

Mahesh Babu Trivikram Movie: మహేశ్ బాబు సర్కారు వారి పాట తో బిజీగా ఉన్నాడు. పరశురాం డైరెక్టర్ గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

Venkata Chari
Published on: 3 May 2021 3:34 PM IST
Mahesh Babu Trivikram Movie
X

మహేశ్ బాబు

Mahesh Babu Trivikram Movie: మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు పరశురాం డైరెక్టర్ గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన తరువాతి సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నాడు.

హరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్ర గురించి ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది.

తాజా నివేదికల ప్రకారం, ఈ చిత్రంలో మహేష్ బాబు రా ఏజెంట్ పాత్రలో నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. తన మునుపటి సినిమాలో మిలటరీ ఆఫీసర్ పాత్ర పోషించిన ప్రిన్స్... త్రివిక్రమ్ సినిమాలో రా ఏజెంట్‌గా కనిపించబోతున్నారంట. మహేష్ బాబును సరికొత్తగా చూపించాలని త్రివిక్రమ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రిన్స్ ఫ్యాన్స్ సరికొత్త పాత్రలో చూసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు నెట్టింట్ హల్ చల్ చేస్తున్నారు.

'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ అయిపోగానే ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. 'మహర్షి' చిత్రం తర్వాత మహేష్ బాబుతో కలిసి ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది.

Venkata Chari

Venkata Chari

Next Story