మహేష్ బాబు తండ్రి విలన్ అయ్యాడు

Ruthvik
Published on: 23 April 2019 11:35 PM IST
మహేష్ బాబు తండ్రి విలన్ అయ్యాడు
X

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా 'మహర్షి' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కాబోతోంది. పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు తన 26వ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలైపోయాయి. ఈ సినిమాలో ప్రముఖ నటుడు జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించబోతున్నట్లు గా సమాచారం అందుతోంది.

అయితే ఈ సినిమాలో జగపతిబాబు పాత్ర నెగిటివ్ గా ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమాలో జగపతి బాబు మహేష్ తండ్రి పాత్రలో కనిపించాడు. ఇప్పుడు మాత్రం విలన్ గా మారబోతున్నాడట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.





Ruthvik

Ruthvik

Next Story