Mahesh Babu Birthday: గోవాలో పుట్టినరోజు జరుపుకోబోతున్న మహేష్ బాబు

Mahesh Babu Birthday: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం "సర్కార్ వారి పాట" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

admin1
Updated on: 7 Aug 2021 3:59 PM IST
Mahesh Babu to Celebrate his Birthday in Goa
X

Mahesh Babu Birthday: గోవాలో పుట్టినరోజు జరుపుకోబోతున్న మహేష్ బాబు

Mahesh Babu Birthday: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం "సర్కార్ వారి పాట" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ సినిమా షూటింగ్ గోవాలో జరగనుంది. ఆగస్టు 9న మహేష్ బాబు తన 46 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. అయితే ఈ సారి తన పుట్టిన రోజును షూటింగ్ సభ్యులతో మాత్రమే కాకుండా తన కుటుంబంతో కూడా జరుపుకోవాలి అనుకుంటున్న మహేష్ బాబు తన కుటుంబంతో పాటు గోవాకి వెళ్ళనున్నారు.

షూటింగ్ కోసం మహేష్ బాబు ముందు రోజే గోవాకి వెళ్ళనున్నారు. ఆ తర్వాత మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ మరియు పిల్లలు గౌతమ్ మరియు సితార కూడా గోవా వెళ్ళబోతున్నారు. కాగా ఈ సంవత్సరం మహేష్ బాబు పుట్టినరోజు సంబరాలు గోవాలో జరగనున్నాయి. మరోవైపు అభిమానులు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మరియు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ పతాకాలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కాబోతున్నట్టు దర్శకనిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

admin1

admin1

Next Story