మహేష్ అభిమానులకు మరోక శుభవార్త

మహేష్ అభిమానులకు మరోక శుభవార్త
x
Highlights

ఈ మధ్యనే 'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' అనే సినిమాలో...

ఈ మధ్యనే 'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్ లో 25 చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్ ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన 'చోటి చోటి బాతే' పాట ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం నుంచి ఒక ప్రోమోషనల్ వీడియో త్వరలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 6వ తేదీన 'మహర్షి' ప్రమోషనల్ వీడియో ఒకటి విడుదల కానుంది. ఇది టీజర్ అని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లేదా మేకింగ్ వీడియో కూడా కావచ్చు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు మూడు అవతారాల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ సినిమా మే 9న విడుదల కానుంది. దిల్ రాజు, అశ్వినీదత్ మరియు పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories