మహేశ్‌- రాజమౌళి సినిమా మొదలయ్యేది అప్పుడే

Mahesh Babu - SS Rajamouli: "బాహుబలి" సినిమా తో సరికొత్త రికార్డులు సృష్టించిన స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి...

Shireesha
Updated on: 10 May 2022 8:23 PM IST
Mahesh Babu SS Rajamouli Movie Going on Sets in 2023 | Tollywood Gossips
X

2023లోనే సెట్స్ పైకి వెళ్లనున్న మహేష్ రాజమౌళి సినిమా...

Mahesh Babu - SS Rajamouli: "బాహుబలి" సినిమా తో ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టించిన స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తాజాగా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల్లు హీరోలుగా నటించిన "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో రికార్డులను తిరగరాశారు. ఇక త్వరలోనే రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలు కావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కేవలం వచ్చే సంవత్సరం మాత్రమే పైకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. రాజమౌళికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కోసం చాలానే సమయం కావాలి. అందుకే సినిమా ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతోంది.

ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి సినిమా "సర్కారు వారి పాట" సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మే 12న భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదల కాబోతుంది. మరోవైపు రాజమౌళి కూడా "ఆర్ ఆర్ ఆర్" సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వీరిద్దరి సినిమా 2023 లో మాత్రమే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా విడుదల గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Shireesha

Shireesha

Next Story