Mahesh Babu: తన పుట్టినరోజున మొక్కలు నాటాలని అభిమానులకు ప్రిన్స్ పిలుపు

Sandeep Reddy
Published on: 6 Aug 2021 3:44 PM IST
Mahesh Babu Special Request to Fans to Plant 3 Saplings Each on His Birthday 9th August 2021
X

మహేష్ బాబు (ట్విట్టర్ ఫోటో)

Mahesh Babu - Green India Challenge: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి 22 ఏళ్ళు పూర్తైన, వయసు 45 ఏళ్ళు దాటినా చెక్కు చెదరని అందంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రిన్స్ గా పిలుచుకునే తన అభిమానులు, డ్రీమ్ బాయ్ గా ఊహించుకునే అమ్మాయిలు చాలానే ఉన్నారు. వరుస సినిమా హిట్లతో మంచి జోరు మీదున్న మహేష్ బాబు ఆగష్టు9 న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక విన్నపాన్ని తెలిపాడు. సాధారణంగా అభిమాన నటుడి పుట్టినరోజులు అభిమానులు రక్తదానాలు, పాలాభిషేకాలు, పెద్ద పెద్ద కటౌట్ లనూ ఏర్పాటు చేసి కేకులను కట్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతారు. కాని ఈసారి మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు మాత్రం కొంత డిఫరెంట్ గా జరగనున్నాయి.

నేడు ట్విట్టర్ మరియు ఇన్స్టా గ్రామ్ లో మహేష్ బాబు తన అభిమానులకు తన పుట్టినరోజున మొక్కలను నాటాలని అభ్యర్థించాడు. తన ఇన్స్టాగ్రామ్ లో మహేష్ ఇలా పోస్ట్ చేశాడు "మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేనెప్పుడు విధేయుడిగా ఉంటానని, ఈ సంవత్సరం నా 46వ పుట్టినరోజు సందర్భంగా నా అభిమానులకు ఒక విన్నపం అని చెప్తూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మద్దతుగా ఆగష్టు9 న ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటాలని మీ అందరినీ కోరుతున్నట్లు" తెలిపాడు.

పర్యావరణాన్ని కాపాడటానికి మరియు కాలుష్యాన్ని నిర్మూలించడానికి, నా పుట్టినరోజు సందర్భంగా విత్తనాలు మరియు మొక్కలను నాటండి మరియు నా పట్ల మీ ప్రేమను చూపించండని మహేష్ బాబు అభిమానులకు పిలుపునిచ్చాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న "సర్కార్ వారి పాట" సినిమా టీజర్ ను మహేష్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేయబోతుంది.



Sandeep Reddy

Sandeep Reddy

Next Story