Shilpa Chowdary Case: పోలీసులను ఆశ్రయించిన మహేష్ బాబు సోదరి

Shilpa Chowdary Case: తాను కూడా మోసపోయాను అంటున్న హీరో భార్య

admin1
Updated on: 4 Dec 2021 8:01 PM IST
Mahesh Babu Sister Priyadarshini Complaints on Shilpa Chowdary
X

తాను కూడా మోసపోయాను అంటున్న హీరో భార్య (ఫైల్ ఇమేజ్)

Shilpa Chowdary Case: ప్రముఖ వ్యాపారవేత్త శిల్పా చౌదరి అధిక వడ్డి ఇప్పిస్తానంటూ ముగ్గురు టాలీవుడ్‌ హీరోలను మోసం చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల మేర శిల్ప పలువురికి నష్టం కలిగించింది. దివ్య రెడ్డి అనే మహిళ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగు చూసింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు శిల్ప ను, ఆమె భర్తను శనివారం (నవంబర్‌ 27) న ఉదయం అరెస్టు చేసి 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు. ఇక వారి రిమాండ్‌ రిపోర్టులో కొన్ని సంచలన విషయాలు బయటకి వచ్చాయి.

ఈ కేసు గురించిన విషయాలు బయటకి వచ్చిన 5 రోజుల తర్వాత ప్రియదర్శిని అనే యువతి పోలీసులను ఆశ్రయించారు. ఆమె మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మరియు హీరో సుధీర్ బాబు భార్య. శిల్ప తన దగ్గర కూడా డబ్బు తీసుకుని మోసం చేసిందంటూ బుధవారం(డిసెంబర్‌ 1) ప్రియదర్శని పోలీసులను ఆశ్రయించడం జరిగింది. తన వద్ద రూ. 2.9 కోట్లు తీసుకుని శిల్ప మోసం చేసినట్లు ఆమె మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డబ్బుల కోసమే ఆమె ప్రతి వీకెండ్‌లో కిట్టి పార్టీ కూడా ఏర్పాటు చేసేదని ప్రియదర్శిని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

admin1

admin1

Next Story