Mahesh Babu: హిట్ అయినా ఫ్లాప్ అయినా సినిమాకి నేనే బాధ్యుణ్ణి

* "ప్రయోగాల జోలికి వెళ్ళాలి అనుకోవట్లేదు" అంటున్న మహేష్ బాబు

admin1
Updated on: 7 Oct 2021 6:31 PM IST
Mahesh Babu Says I am the Responsible Person if my Movie Hit or Flop | Tollywood News Today
X

మహేష్ బాబు (ఇంస్టాగ్రామ్ ఫోటో)

Mahesh Babu: "సరిలేరు నీకెవ్వరు" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఇప్పుడు పరుశురామ్ దర్శకత్వంలో "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే మహేష్ బాబు తన సినిమా ఓపెనింగ్స్ కి రారు. అది ఒక సెంటిమెంట్ గా భావిస్తారు మహేష్ బాబు.

అందుకే ఆయన బదులు మహేష్ బాబు భార్య నమ్రత పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు సినిమా కథలని నమ్రత నే వింటారని మహేష్ బాబు సినిమా చేయాలా వద్దా అని కూడా ఆమె నిర్ణయిస్తారని అందరూ అనుకుంటూ ఉంటారు. ఈ విషయాలపై తాజాగా స్పందించారు సూపర్ స్టార్.

"నా సినిమా కథలు నేనే వింటాను. ఇప్పుడే కాదు పెళ్లికి ముందు నుంచి నా సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అందుకు నేనే బాధ్యుడిని అని భావిస్తాను. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే నేను చేసిన పొరపాట్లు ఏమిటో అంచనా వేసి అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను.

నేను ఎప్పుడూ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నాకు నచ్చిన కథలు చేస్తూ వెళ్తాను కానీ ప్రయోగాలు జోలికి వెళ్ళను. "స్పైడర్" సినిమా తర్వాత ఇది నేను నేర్చుకున్న గుణపాఠం," అని అన్నారు మహేష్ బాబు. ఇక సినిమాకి సంబంధించిన విషయాలన్నీ తన సమక్షంలోనే జరుగుతాయని ఎప్పుడూ తాను ఎవరిపైనా ఆధారపడినని చెప్పుకొచ్చారు మహేష్.

admin1

admin1

Next Story