"సర్కారు వారి పాట" విషయంలో మహేష్ బాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు

Mahesh Babu Sarkaru Vaari Paata Movie release as a pan-India film | Tollywood News
x

సర్కారు వారి పాట" ప్యాన్ ఇండియన్ సినిమాగా మారనుందా?

Highlights

సర్కారు వారి పాట" ప్యాన్ ఇండియన్ సినిమాగా మారనుందా?

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమా అయిన "సర్కారు వారి పాట" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మహానటి సినిమా ఫేమ్ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా రాజకీయ బ్యాక్ డ్రాప్తో సాగుతుంది. ఈ సినిమాలో సముతిరఖని, సుబ్బరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా మార్చాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

తెలుగులో మాత్రమే కాక ఈ సినిమాని కూడా కానీ పలు భాషల్లో కూడా విడుదల చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారట. ఈ విషయమై మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ వారు మహేష్ బాబుతో ఈ విషయాన్ని డిస్కస్ చేశారు కానీ మహేష్ బాబు మాత్రం ఈ సినిమాని ప్యాన్ ఇండియన్ సినిమాగా మార్చడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదట. ఒకవేళ మహేష్ బాబు ఒప్పుకుంటే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా విషయంలో మహేష్ బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories