'నేను విన్నాను.. నేను ఉన్నాను'.. సర్కారు వారి పాట ట్రైలర్‌లో జగన్ డైలాగ్‌..

Sarkaru Vaari Paata: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’.

Arun Chilukuri
Published on: 2 May 2022 5:10 PM IST
Mahesh Babu Sarkaru Vaari Paata Movie Official Trailer Out Now
X

‘నేను విన్నాను.. నేను ఉన్నాను’.. సర్కారు వారి పాట ట్రైలర్‌లో జగన్ డైలాగ్‌..

Sarkaru Vaari Paata: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 12 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఆ అంచనాలను పెంచేలా తీర్చిదిద్దిన ట్రైలర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.

'యు కెన్‌ స్టీల్‌ మై లవ్‌(నా ప్రేమ దొంగలించగలవు), యు కెన్‌ స్టీల్‌ మై ఫ్రెండ్‌షిప్‌(నా స్నేహాన్నీ.. దొంగలించగలవు'.. బట్‌ యు కాంట్‌ స్టీల్‌ మై మనీ' అంటూ మహేశ్‌ చెప్పే డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక 'నేను ఉన్నాను.. నేను విన్నాను' అంటూ ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు ముందు తరచూ కొట్టే డైలాగ్‌ను మహేష్ నోటి వెంట అనిపించడం ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story