Mahesh Babu - Rajamouli: మరొక కథ రెడీ చేయమంటున్న మహేష్ బాబు

* కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ కోసం వర్క్ చేస్తున్నారు *మహేష్ బాబు తో సినిమా కి కథ రెడీ చేస్తున్న స్టార్ రైటర్

admin1
Updated on: 21 Sept 2021 7:01 PM IST
Mahesh Babu Said to Rajamouli to Prepare a Story for the Film
X

రాజమౌళి-మహేష్ బాబు(ఫోటో-ది హన్స్ ఇండియా)

Mahesh Babu-Rajamouli: ప్రస్తుతం "ఆర్ఆర్ఆర్" సినిమాతో బిజీగా ఉన్న రాజమౌళి ఈ సినిమా పూర్తయిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. జేమ్స్ బాండ్ లాంటి ఒక కథని రాజమౌళి మహేష్ బాబు తో తీయబోతున్నాడని పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాజమౌళి ఒక ఇంగ్లీష్ నవల హక్కులను కూడా కొనుకున్నట్లు కొందరు చెప్పుకొచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబుతో చేయాల్సిన సినిమా కోసం ఇంకా రాజమౌళి ఏ కథను ఎంపిక చేయలేదట. నిజానికి రాజమౌళి మరియు మహేష్ బాబు మధ్య కథకి సంబంధించి చర్చలు జరిగాయి.

కానీ అందులో ఏ ఒక్కటి కూడా మహేష్ కి నచ్చకపోవడంతో ఒక స్టోరీ రెడీ చేయమని రాజమౌళితో చెప్పారట. ఈ నేపథ్యంలోనే కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ కోసం వర్క్ చేస్తున్నారు. మరో వైపు మహేష్ బాబు పరశురాం దర్శకత్వం వహిస్తున్న "సర్కారు వారి పాట" సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమైంది. మరోవైపు రాజమౌళి కూడా "ఆర్ ఆర్ ఆర్" పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

admin1

admin1

Next Story