Mahesh Babu - Sitara: "నా కూతురికి తెలుగు సినిమాల్లో నటించాలని లేదట"

* హాలీవుడ్ సినిమాలు చేయాలని ఆశ పడుతున్న మహేష్ బాబు కూతురు

admin1
Updated on: 25 Sept 2021 7:30 PM IST
Mahesh Babu Said that My Daughter not Interested to Act in Telugu Movies
X

మహేష్ బాబు - సితార (ఫైల్ ఫోటో) 

Mahesh Babu - Daughter Sitara: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ మరోవైపు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ తో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే మహేష్ బాబు పిల్లలు గౌతమ్, సితార కూడా ఇండస్ట్రీకి సుపరిచితమే. మహేష్ బాబు హీరోగా నటించిన "1 నేనొక్కడినే" సినిమాలో గౌతమ్ మహేష్ బాబు చిన్నప్పటి పాత్ర లో కనిపించాడు.

సితార ఘట్టమనేని కూడా ఒకవైపు యూట్యూబ్ ఛానల్ లో కనిపిస్తూ మరోవైపు "ఫ్రోజెన్" తెలుగు డబ్బింగ్ వర్షన్ లో ఒక పాత్రకి డబ్బింగ్ కూడా చెప్పింది. ఇక సితార ఒక నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయా అని అడగగా మహేష్ బాబు ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.

"తనకి తెలుగు సినిమాలు చేయాలని లేదట. తను ఇంగ్లీష్ సినిమాలు చేయాలనుకుంటుంది. ఏదో ఒక ఫన్నీ కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు తనే అలా చెప్పింది. మా పిల్లలు ఏం అవ్వాలనుకుంటున్నారు అనే విషయం మేము వాళ్లకి వదిలేస్తాం. నిజం చెప్పాలంటే నాకు నా కూతురు తో కలిసి నటించడం అంటే చాలా భయం," అని అన్నారు మహేష్ బాబు.

ప్రస్తుతం "సర్కారు వారి పాట" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. రాజమౌళి తో కలిసి పనిచేయడం తన కల అని అది ఇన్నాళ్ళకి నెరవేరబోతోందని చెప్పారు మహేష్ బాబు.

admin1

admin1

Next Story