రాజమౌళి కోసం సెంటిమెంట్‌ని త్యాగం చేస్తున్న మహేష్ బాబు...

Mahesh Babu: మహేష్ బాబుకి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ ఒక సెంటిమెంట్ థియేటర్ అని చెప్పుకోవచ్చు...

Shireesha
Updated on: 8 May 2022 2:31 PM IST
Mahesh Babu Sacrifice Sudharshan Theatre for SS Rajamouli RRR Movie | Tollywood Gossips
X

రాజమౌళి కోసం సెంటిమెంట్‌ని త్యాగం చేస్తున్న మహేష్ బాబు...

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "సర్కారు వారి పాట". మహానటి బ్యూటీ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా మే 12న థియేటర్లలో విడుదల కాబోతోంది. అయితే మహేష్ బాబుకి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ ఒక సెంటిమెంట్ థియేటర్ అని చెప్పుకోవచ్చు.

మహేష్ బాబు నటించిన పోకిరి, ఒక్కడు, దూకుడు, మురారి, బిజినెస్ మాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర సినిమాలు ఈ థియేటర్లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. సొంతంగా మహేష్ బాబు కు ఏ ఎం బీ సినిమా ఉన్నప్పటికీ సుదర్శన్ థియేటర్ మహేష్ బాబు కి చాలా స్పెషల్. అయితే మరి కొద్ది రోజుల్లో "ఆర్ ఆర్ ఆర్" సినిమా 50 రోజులు పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ దర్శకనిర్మాతలు థియేటర్ ఓనర్ లను సినిమా 50 రోజులు పూర్తి చేసుకునే దాకా ఉంచమని కోరుతున్నారట.

యాభై రోజుల పాటు రోజుకు కనీసం మూడు షో లైనా ఆడితేనే సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్నట్టు. అందుకని మహేష్ బాబు సినిమా విడుదలైన మొదటి రెండు రోజులు కేవలం 7 గంటలు మరియు 11 గంటల షో లు మాత్రమే వేయనున్నారట. మిగతా మూడు షో లు ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆడనుంది. ఇక సర్కారు వారి పాట విడుదలైన మూడవ రోజుకి ఆర్ఆర్ఆర్ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంటుంది. ఆ తర్వాత నుంచి అన్ని షో లలోనూ "సర్కారు వారి పాట" సినిమా ఆడబోతుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు థియేటర్ త్యాగం చేసినట్లు సమాచారం.

Shireesha

Shireesha

Next Story