Mahesh Babu: ఉప్పెన బ్యూటీ లక్కీ ఛాన్స్ కొట్టేసిందా?

Mahesh Babu Romance With Uppena beauty Krithi Shetty
x

మహేశ్ బాబు, కృతిశెట్టి (ఫొటో ట్విట్టర్)

Highlights

Mahesh Babu: ఉప్పెనMahesh Babu: ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కృతిశెట్టి.

Mahesh Babu: ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కృతిశెట్టి. ఈ సినిమా విజయవంతం కావడంతో ఈ శాండిల్ వుడ్ బ్యూటీ ఫుల్ జోష్ లో ఉంది. నిండా పద్దెనిమిదేళ్లు నిండని ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకపోతోంది.

ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని 'శ్యామ్ సింగరాయ్' లో ఛాన్స్ కొట్టేసిన కృతిశెట్టి... ఆ సినిమా పూర్తికాకముందే.. ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన మరో అవకాశాన్ని సంపాధించింది. తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్లో తెరకెక్కనుంది ఈ చిత్రం.

తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ఏంటంటే, ఈ అమ్మడు ఏకంగా టాప్ స్టార్ సరసన నటించే చాన్స్ కొట్టేసిందంట. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రొమాన్స్ చేసేందుకు రెడీగా ఉందనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' తో మహేష్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో ఓ సినిమా చేయనున్నాడు.

అయితే.. ఆ సినిమా స్టార్ట్ అయ్యే లోపు మరో సినిమా ఫినిష్ చేయాలని ఆలోచిస్తున్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోనే కృతిశెట్టిని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే... కృతిశెట్టి టాప్ హీరోయిన్లకు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ పెద్దలు మాట్లాడుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories