Mahesh Babu Request To Fans : అభిమానులకి మహేష్ బాబు విజ్ఞప్తి!

Mahesh Babu Request To Fans : ఆగస్టు తొమ్మిదిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 45 సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు.. ఇది మహేష్ బాబుకి

Krishna
Published on: 7 Aug 2020 11:15 AM IST
Mahesh Babu Request To Fans : అభిమానులకి మహేష్ బాబు విజ్ఞప్తి!
X
Mahesh Babu (File Photo)

Mahesh Babu Request To Fans : ఆగస్టు తొమ్మిదిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 45 సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు.. ఇది మహేష్ బాబుకి మాత్రమే కాదు.. అయన ఫ్యాన్స్ కూడా ఇది ఎంతో గొప్పదైన రోజు కూడా.. మహేష్ పుట్టినరోజుకి నెలరోజుల ముందే ట్విట్టర్ వేదికగా మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా మొదలు పెట్టేశారు. అయితే తాజాగా మహేష్ తన అభిమానులకి విజ్ఞప్తి చేశారు.

"ప్రియమైన అభిమానులకు, మీరందరూ నాకు తోడుగా ఉండడం నా అదృష్టం. నా పుట్టినరోజు, ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుండాలని మీరు చేస్తున్న మంచి పనులకు చాలా సంతోషంగా ఉంది. అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను.. ప్రస్తుతం కరోనాతో మనమందరం చేస్తున్న ఈ యుద్ధంలో సురక్షితంగా ఉండడం అనేది అన్నిటికంటే ముఖ్యం. నా పుట్టిన రోజున అభిమానులందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను " అని మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గీతా గోవిందం ఫేం పరుశురాంతో సర్కారు వారి పాట అనే సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక స్క్రిప్టు వర్క్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలో పట్టలెక్కనుంది.. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించనుంది.


Krishna

Krishna

Next Story