Love Story Movie: లవ్ స్టోరీ నుండి మరోపాటను విడుదల చేసిన మహేష్ బాబు

Love Story Movie: చిత్రం లవ్ స్టోరి నుంచి మరో కొత్త పాట మహేష్ బాబు చేతుల మీదుగా విడులైంది.

Kranthi
Updated on: 25 March 2021 12:24 PM IST
Mahesh Babu Released Evo Evo Kalale Song from Love Story Movie
X

 Love Story Movie:(ట్విట్టర్ ఫోటో)

Love Story Movie: దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో అక్కినేని వారసుడు నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో హైదరాబాద్ నేపథ్యంగా "లవ్ స్టోరి" పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి మరోసాంగ్ విడుదలైంది. ఈ తాజా పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు. అంతేకాకుండా టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

భాస్కరభట్ల రవికుమార్ రచించిన ఈ పాటను జోనితా గాంధీ నకుల్ అభ్యాంకర్ పాడారు. ఏవో ఏవో కలలు పేరుతో సాగుతున్న ఈ పాట నెటిజన్స్‌ భాగానే అలరిస్తోంది. వానాలో నాగచైతన్య సాయి పల్లవి డాన్స్ ఇరగదీశారు. ఇక గతంలో విడుదలైన అన్ని పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి. సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవ్వుతూ అదరగొడుతున్నాయి. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన సారంగ దరియా సాంగ్ సోషల్ మీడియాలో రచ్చచేస్తోంది. మంచి లిరిక్స్‌తో పాటు సాయి పల్లవి ఫ్యాక్టర్ కూడా ఉండడంతో పాట ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల విషయానికి వస్తే.. సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నాడు.

అందులో భాగంగా ఆయన దర్శకత్వంలో వస్తున్న మరో సినిమా.. లవ్ స్టోరి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదలకానుంది. పాటలు, టీజర్ కారణంగా ఈ సినిమాకు ఏర్పడ్డ హైప్ మేరకు భారీ స్థాయిలో థియేట్రికల్ రైట్స్ అమ్మడు పోయినట్లు సమాచారం. 'లవ్ స్టోరీ' చిత్రానికి బిజినెస్ పరంగా మంచి ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయట. ఈ చిత్రం థియేట్రికల్ హక్కులు సుమారు 30 కోట్లకు అమ్ముడుపోయిన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు శాటిలైట్ అండ్ ఓవర్సీస్ రైట్స్ ఓ రేంజ్‌లో అమ్ముడుపోయాయని టాక్.



Kranthi

Kranthi

Next Story