Rajamouli - Mahesh: అప్పుడే పట్టాలు ఎక్కనున్న మహేష్ బాబు జక్కన సినిమా

Mahesh Babu Rajamouli Combination New Movie Starts in 2022 Summer Season
x

Rajamouli - Mahesh Babu: (Photo: The Hans India)

Highlights

Rajamouli - Mahesh Babu Movie: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన...

Rajamouli - Mahesh Babu Movie: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా కూడా పూర్తయిన తరువాత మొట్టమొదటిసారిగా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా పట్టాలు ఎక్కనుంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకి స్క్రిప్ట్ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా మొత్తం ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ తో సాగుతుందనే విషయాన్ని రివీల్ చేశారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందని అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు వచ్చే ఏడాది సమ్మర్ లోపు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు రాజమౌళి చిత్రం సమ్మర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోపు రాజమౌళి కూడా తన తదుపరి సినిమా అయిన "ఆర్ ఆర్ ఆర్" ను పూర్తిచేసి త్వరలో విడుదల చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories