Mahesh Babu: రాజమౌళికి కండిషన్లు పెడుతున్న సూపర్ స్టార్

Mahesh Babu: ఈ మధ్యనే "సర్కారు వారి పాట" సినిమాతో మంచి హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు..

Arun Chilukuri
Updated on: 6 July 2022 9:30 PM IST
Mahesh Babu Put Such Condition For Rajamouli
X

Mahesh Babu: రాజమౌళికి కండిషన్లు పెడుతున్న సూపర్ స్టార్

Mahesh Babu: ఈ మధ్యనే "సర్కారు వారి పాట" సినిమాతో మంచి హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం రాజమౌళితో సినిమా చేయడానికి మహేష్ బాబు భయపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటిదాకా రాజమౌళి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లు అయినప్పటికీ ఒక్కో సినిమాకి జక్కన్న ఎక్కువ సమయం తీసుకునే సంగతి అందరికీ తెలిసిందే. అనుకున్న సమయానికి ఎప్పుడు రాజమౌళి సినిమా విడుదల అవ్వదు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు రెండేళ్లు రాజమౌళి సినిమా కోసం పక్కన పెట్టాల్సి వస్తోంది. తాజాగా మహేష్ బాబు రాజమౌళికి ఒక రిక్వెస్ట్ చేశారట. సినిమాలో తన పాత్ర కి ఎటువంటి స్పెషల్ లుక్ ఇవ్వద్దని ఈ సినిమా షూటింగ్ చేస్తూనే మరో సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసేలాగా ఉంటే బాగుంటుందని మహేష్ బాబు కోరారట.

అంతేకాకుండా ఎప్పుడూ బిజీగా ఉండే నటులను కాకుండా సినిమాకి కొంచెం ఫ్రీగా ఉండే నటులను ఎంపిక చేయమని దానివల్ల షూటింగ్ కి ఎక్కువ రోజులు ఎదురు చూడాల్సిన అవసరం రాదని అన్నారట. అయితే మరోవైపు అభిమానులు మాత్రం సర్కారు వారి పాట, మహర్షి వంటి నాలుగు సినిమాలు చేయడం కంటే మూడు నాలుగేళ్లు పట్టినా సరే రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సినిమా చేయడం మహేష్ కెరీర్ కి బూస్ట్ అవుతుంది అని భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story