SSMB29 పై ప్రియాంక చోప్రా ఆసక్తికర కామెంట్… ఫ్యాన్స్‌లో జోష్!

Mahesh Babu Priyanka Chopra SSMB29 Update
x

SSMB29 పై ప్రియాంక చోప్రా ఆసక్తికర కామెంట్… ఫ్యాన్స్‌లో జోష్!

Highlights

SSMB 29: కథానాయకుడు మహేశ్‌బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కలయికలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్‌ ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ గురించి దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

SSMB 29: కథానాయకుడు మహేశ్‌బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కలయికలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్‌ ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ గురించి దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వెలువడగా… ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక, “నేను ఇండియాను, హిందీ సినిమాలను చాలా మిస్ అవుతున్నాను. ఈ ఏడాది ఓ భారతీయ సినిమాలో నటిస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇండియన్ ఆడియన్స్ నాకు చూపే ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. అది ఎప్పుడూ ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నాను” అంటూ పేర్కొన్నారు. దీంతో ఇది ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ గురించే అని మహేశ్ అభిమానులు సంబరపడుతున్నారు.

అదే ఇంటర్వ్యూలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ చిత్రం ‘బొంబాయి’ గురించి కూడా ప్రియాంక మాట్లాడారు. “నేను చిన్నప్పుడే ఎక్కువ సినిమాలు చూడలేదు. మా నాన్నకు సంగీతం అంటే అమితాసక్తి. ఇంట్లో ఎప్పుడూ పాటలు వినిపించేవి. 13 ఏళ్ల వయసులో ముంబయిలో ఓ థియేటర్‌లో ‘బొంబాయి’ చూశాను. నాకు తర్జనభర్జనలు, భావోద్వేగాల పట్ల అవగాహన వచ్చిన తర్వాత చూసిన మొదటి సినిమా అదే. ఆ అనుభవం ఇప్పటికీ మర్చిపోలేను” అన్నారు.

‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ విషయానికొస్తే… ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. అటవీ నేపథ్యంలో సాగే సాహస గాథగా, ప్రపంచాన్ని చుట్టేసే కథతో దర్శకుడు రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేశ్‌బాబు తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని విభిన్నమైన పాత్రలో, సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు. ఈ సినిమాతో భారతీయ సినీ పరిశ్రమకు కొత్త ప్రపంచం తేవబోతున్నాం అని రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories