Mahesh Babu: రాజమౌళి ని ఆకాశానికి ఎత్తేస్తున్న మహేష్ బాబు

Mahesh Babu: "అర్ఆర్ఆర్" మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్న సూపర్ స్టార్

admin1
Updated on: 28 March 2022 11:42 AM IST
Mahesh Babu Praises RRR Movie | Tollywood News
X

రాజమౌళి ని ఆకాశానికి ఎత్తేస్తున్న మహేష్ బాబు

Mahesh Babu: బాహుబలి ఫ్రాంచైస్ తర్వాత "అర్ఆర్ఆర్" సినిమా తో మరొక బ్లాక్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. "అర్ఆర్ఆర్" బృందంతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. దానికి కారణం మహేష్ బాబు హీరోగా చేస్తున్న తదుపరి సినిమా రాజమౌళి దర్శకత్వంలో నే కాబట్టి. తాజాగా ఈ చిత్రం సక్సెస్ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తి కరమైన స్టేట్మెంట్లు ఇచ్చారు మహేష్ బాబు.

"మామూలు సినిమాలు వేరు. రాజమౌళి సినిమాలు వేరు. ఆర్ ఆర్ ఆర్ ఒక ఎపిక్ సినిమా. ఆ స్కేల్, అద్భుతమైన విజువల్స్, మ్యూజిక్ అద్భుతంగా, ఎవరూ ఊహించనటువంటి విధంగా ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో అయితే మనల్ని మనం మర్చిపోయి సినిమాలో బాగా లీనమై పోతాము. కేవలం డైరెక్టర్ ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ అయితేనే అలా జరుగుతుంది.

రాజమౌళి ఫిలిం మేకింగ్ చాలా సెన్సేషనల్ గా ఉంటుంది. మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది సార్. తారక్ మరియు చరణ్ తమ స్టార్ డమ్ కి మించి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అని అనిపించింది. నాటు నాటు పాటలో అసలు గ్రావిటీ లేదా అనిపించింది వారు గాలిలో తేలుతున్నట్లు అనిపించింది" అని సినిమా మీద ప్రశంసల వర్షం కురిపించారు మహేష్ బాబు.

admin1

admin1

Next Story