Mahesh Babu- Nani: నాని టీమ్‌పై మహేశ్‌బాబు ప్రశంసలు

Mahesh Babu Praises Nani: నాని విడుదల చేసిన వీడియోసాంగ్ చాలా బాగుందని మహేశ్ బాబు అప్రిషియేట్

Kranthi
Published on: 20 Jun 2021 8:11 AM IST
Mahesh Babu Praises Nani and Satyadev
X

Mahesh Babu Praises Nani:(File Image)

Mahesh Babu Praises Nani: నాని నానికే నచ్చాడు. నేచురల్‌ స్టార్‌నాని చేసిన పని బాగుందని నాని పొగిడేశాడు. అదేనండి హీరో నాని విడుదల చేసిన వీడియోసాంగ్ చాలా బాగుందని నాని సినిమా హీరో మహేశ్ బాబు ట్విట్టర్లో చెప్పారు. ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం ఈ విధంగా చేయడం గ్రేట్ అంటూ అప్రిషియేట్ చేశాడు నానిని.. మహేశ్ బాబు.నాని తన టీమ్‌తో కలిసి 'దారే లేదా' అనే వీడియో సాంగ్‌ను రూపొందించి.. విడుదల చేసిన విషయం తెలిసిందే. దానికి యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది.

తాజాగా ప్రముఖ కథానాయకుడు మహేశ్‌బాబు సైతం ట్విటర్‌ వేదికగా ఈ పాటపై స్పందించారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు అంకితమిస్తూ రూపొందించిన ఈ వీడియో సాంగ్‌ తనను ఎంతో ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు. నాని, చాయ్‌ బిస్కట్‌ టీమ్‌ కలిసి చేసిన ఈ కార్యక్రమం ఆదర్శవంతమైందని మహేశ్‌ పేర్కొన్నారు. మహేశ్‌బాబు చేసిన ట్వీట్‌కు నాని బదులిస్తూ.. ''థాంక్యూ సర్‌, మీ స్పందన మా పాటను ఎంతో మంది హృదయాలకు చేరుస్తుంది. ఇంకా ఎక్కువ అడగదలచుకోలేదు'' అని పేర్కొన్నారు. ఈ పాటలో కీలక పాత్ర పోషించిన సత్యదేవ్‌ సైతం స్పందిస్తూ.. మహేశ్‌కు ధన్యవాదాలు చెప్పాడు.

కరోనా సమయంలో తమ ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల గొప్పతనం తెలియజేసేలా తెరకెక్కించిన ఈ పాటను ఈ నెల 18న విడుదల చేశారు. విజ‌య్ బుల్గానిన్‌ స్వరాలు స‌మ‌కూర్చిన‌ ఈ పాట‌కు కె.కె. సాహిత్యం అందించారు. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ పతాకంపై నాని సమర్పణలో రూపొందించారు. న‌టులు సత్యదేవ్‌‌, రూప ఈ గీతంలో కనిపించారు. చాయ్‌ బిస్కెట్‌ ఈ పాటను ఎగ్జిక్యూట్‌ చేసింది. తెలుగు, త‌మిళ భాషల్లో రూపొందిందీ గీతం.

.

Kranthi

Kranthi

Next Story