మెగాస్టార్ తో క్లాష్ వద్దు అనుకుంటున్న మహేష్ బాబు?

*చిరంజీవి కోసం తన సినిమా విడుదల వాయిదా వేస్తున్న మహేష్ బాబు?

Jyothi
Updated on: 29 Jan 2023 8:01 PM IST
Mahesh Babu Postponing the Release of His Film For Chiranjeevi?
X

చిరంజీవి కోసం తన సినిమా విడుదల వాయిదా వేస్తున్న మహేష్ బాబు?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన "సర్కారు వారి పాట" సినిమా విడుదలై ఇప్పటికే చాలా కాలం అయింది. కానీ మహేష్ బాబు మాత్రం ఇంకా తన నెక్స్ట్ సినిమా విడుదల గురించి క్లారిటీ ఇవ్వటం లేదు. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆగస్టు లో విడుదలవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని అక్టోబర్ కి వాయిదా వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి సినిమాతో క్లాష్ అవ్వకుండా ఉండడానికి మహేష్ బాబు తన సినిమాని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే "వాల్తేరు వీరయ్య" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరంజీవి త్వరలోనే "భోళా శంకర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టులో విడుదలవుతుంది అని చిత్ర బృందం ప్రకటించింది.

దీంతో మహేష్ బాబు మరియు చిత్ర బృందం తమ సినిమాని అక్టోబర్ కి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. #ఎస్ఎస్ఎంబి28 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. హారిక మరియు హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. అతడు, ఖలేజా వంటి సూపర్ హిట్ సినిమాలు తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడవ సినిమా ఇది.

Jyothi

Jyothi

Next Story