Mahesh Babu: మళ్లీ వెకేషన్ ప్లాన్ చేస్తున్న మహేష్ బాబు...

Mahesh Babu: ఎప్పుడు సమయం దొరికినా భార్య నమ్రత మరియు పిల్లలు గౌతమ్ సితార లతో గడపడానికి ఇష్టపడే మహేష్ బాబు..

admin1
Updated on: 23 March 2022 1:45 PM IST
Mahesh Babu Planning for Summer Vacation | Tollywood News
X

Mahesh Babu: మళ్లీ వెకేషన్ ప్లాన్ చేస్తున్న మహేష్ బాబు...

Mahesh Babu: ఈ మధ్యనే సరిలేరు నీకెవ్వరు సినిమా తో సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమాతో బిజీగా ఉన్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం వేసవి లో వెకేషన్ కు వెళ్లటం మహేష్ బాబుకి అలవాటు.

ఎప్పుడు సమయం దొరికినా భార్య నమ్రత మరియు పిల్లలు గౌతమ్ సితార లతో గడపడానికి ఇష్టపడే మహేష్ బాబు.. ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశానికి వెళ్లి తిరిగి వస్తూ ఉంటారు. తాజాగా ఈ సంవత్సరం కూడా తమ ప్లాన్ ని ఫిక్స్ చేసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం వచ్చే నెల "సర్కారు వారి పాట" సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కాబోతోంది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయబోతున్నారు.

అయితే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళ్ళే ముందు మహేష్ బాబు చిన్న గ్యాప్ తీసుకొని సమ్మర్ హాలిడేస్ లో తన కుటుంబంతో కలిసి ఏదైనా ఫారిన్ కంట్రీ కి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు మహేష్ బాబు. జూన్ లేదా జులైలో త్రివిక్రమ్ తో సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story