Mahesh Babu: ఆ సమయంలో నా గొంతు తడారిపోయింది.. మౌనంగా ఉండిపోయా...

Mahesh Babu: యువహీరో అడవిశేష్ తాజాగా ఇప్పుడు మేజర్ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు...

Shireesha
Updated on: 10 May 2022 6:30 PM IST
Mahesh Babu Opinion on Adivi Sesh Major Movie | Major Release Date | Live News
X

Mahesh Babu: ఆ సమయంలో నా గొంతు తడారిపోయింది.. మౌనంగా ఉండిపోయా...

Mahesh Babu: యువహీరో అడవిశేష్ తాజాగా ఇప్పుడు మేజర్ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తన కెరియర్ లోనే మొట్టమొదటి ఇండియన్ సినిమా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయబోతోంది. తాజాగా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. సినిమా ని నిర్మిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తో పాటు మరికొందరు ప్రముఖులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.

అడవి శేష్ ఈ సినిమాలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో కనిపించనున్నారు. జి ఎం బి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మహేష్ బాబు స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుతూ మహేష్ బాబు తన అభిప్రాయాన్ని చెప్పారు. తాను ఇప్పటికే సినిమా చూశానని, సినిమా తనకి బాగా నచ్చిందని అన్నారు మహేష్ బాబు.

సినిమాలో చాలా సన్నివేశాలు ప్రేక్షకులను ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. ముఖ్యంగా సినిమా ఆఖరి 30 నిమిషాలు చూస్తున్నప్పుడు నా గొంతులో ఏదో అడ్డం పడినట్లు అనిపించింది. సినిమా క్లైమాక్స్ చూసినా నా గొంతు తడారిపోయింది. సినిమా అయిపోయాక ఒక రెండు నిమిషాలు మౌనం గా ఉండిపోయా. ఆ తరువాత అడవి శేష్ కి గట్టిగా హగ్ ఇచ్చాను" అని చెప్పుకొచ్చారు మహేష్ బాబు. మంజ్రేకర్ రేవతి ప్రకాష్ రాజ్ శోభిత ధూళిపాళ మురళి శర్మ ఈ సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది.

Shireesha

Shireesha

Next Story