సుక్కు తో సినిమా చేయట్లేదు అంటున్న స్టార్ హీరో

ఈ మధ్యనే 'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ...
ఈ మధ్యనే 'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ ఈ మధ్యనే 'రంగస్థలం' తో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు సుకుమార్ తో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంత కాలంగా సుకుమార్ చెప్పిన స్క్రిప్టు నచ్చకపోవడంతో మహేష్ అందులో కొన్ని మార్పులు చెబుతున్నాడని సుక్కు అవి చేసే పనిలో బిజీ అయ్యాడని పుకార్లు బయటకు వచ్చాయి. ఇదంతా ఒకెత్తయితే సుకుమార్ తర్వాత సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేయనున్నాడు అనే అని నిన్న వచ్చిన అధికారిక ప్రకటన మరొక ఎత్తు.
అయితే తాజాగా మహేష్ బాబు స్వయంగా ఫేస్బుక్ ద్వారా సుకుమార్ తో సినిమా చేయట్లేదని వెల్లడించాడు. "కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన సుకుమార్, నేను సినిమా సినిమా చేయటం లేదు. తన కొత్త సినిమా కోసం ఆల్ ద బెస్ట్. ఒక దర్శకుడిగా ఆయన ఎక్సలెన్స్ ను నేను ఎప్పుడూ గౌరవిస్తాను. 'వన్ నేనొక్కడినే' సినిమా నా కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోతుంది. ఆ సినిమా కోసం పనిచేస్తున్న ప్రతి క్షణం నేను చాలా ఎంజాయ్ చేశాను. మీ తదుపరి ప్రాజెక్టు కోసం ఆల్ ది బెస్ట్ సర్" అని పోస్ట్ చేశాడు మహేష్ బాబు. ఇక 'మహర్షి' సినిమా తరువాత మహేష్ బాబు తదుపరి సినిమా అనిల్ రావిపూడి తో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
ముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMT