మహేష్ సినిమాలో కాంగ్రెస్ నేత

మహేష్ సినిమాలో కాంగ్రెస్ నేత
x
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడి పల్లి దర్శకత్వంలో మహేష్ బాబు కెరీర్ లో 25...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడి పల్లి దర్శకత్వంలో మహేష్ బాబు కెరీర్ లో 25 సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రం మే 9 న విడుదల కానుంది. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబు ఈ మధ్యనే 'ఎఫ్ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. 'ఎఫ్ 2' ని నిర్మించిన దిల్ రాజు ఈ సినిమాను కూడా ఈ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇద్దరూ పాప్యులర్ నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వారు విజయశాంతి మరియు ఉపేంద్ర. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలుగులో ఆఖరిసారిగా అల్లు అర్జున్ నటించిన 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా లో కనిపించారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై మహేష్ బాబు సినిమాతో కనిపించనున్నారు. ఇక ఎప్పుడో 2006లో 'నాయుడమ్మ' సినిమాలో కనిపించిన విజయశాంతి రాజకీయాల్లో బిజీ అయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమా ద్వారా తెలుగు టాలీవుడ్ లోకి రీఎంట్రి ఇవ్వనున్నట్లు సమాచారం అందుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories