Mahesh Babu New Movie: అనిల్ రావిపూడి..రాజమౌళి..మహేష్ సినిమా ఎవరితో?

Mahesh Babu New Movie: మహేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రవిపూడి కాంబో లో వచ్చిన 'సరిలేరు నీకేవరు' బ్లాక్ బస్టర్ అయింది.

Venkata Chari
Published on: 2 March 2021 4:10 PM IST
Mahesh Babu New Movie Who is next Anil Ravipudi or SS Rajamouli
X

మహేశ్ బాబు, అనిల్ రావిపూడి (ఫోటో హన్స్ ఇండియా)

Mahesh Babu New Movie: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రవిపూడి కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకేవరు' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గత సంవత్సరం సంక్రాంతికి విడుదలై భారీ హిట్ కొట్టింది. అయితే ఈ సూపర్ హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందని టాక్ నడుస్తోంది. మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఈ ప్రాజెక్ట్ ముగిసిన తరువాత, మహేష్ బాబు ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌలితో ఓ సినిమా మొదలుపెట్టునున్నాడు. వీటి తర్వాత అనిల్ రావిపూడి తో జత కట్టనున్నట్లు తెలుస్తుంది. మూడు నెలల్లో ఆసక్తికరమైన స్క్రిప్ట్‌తో ముందుకు రావాలని మహేష్ బాబు డైరెక్టర్ ను కోరినట్లు సమాచారం. అయితే అనిల్ రావిపూడి, తనకు మరికొంత టైం కావాలని కోరినట్లు తెలుస్తోంది. అంతా సవ్యంగా జరిగితే, రాజమౌళి చిత్రాన్ని ప్రారంభించడానికి ముందే మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ లో నటించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

Venkata Chari

Venkata Chari

Next Story