Mahesh Babu: త్వరలో మళ్లీ పట్టాలు ఎక్కనున్న మహేష్ బాబు సినిమా షూటింగ్

Mahesh Babu: ఇంకా 45 రోజులు మాత్రమే మిగిలి ఉన్న "సర్కారు వారి పాట" షూటింగ్

admin1
Updated on: 23 Dec 2021 8:30 PM IST
Mahesh Babu New Movie Sarkaru Vaari Paata With only 45 days left in the Shooting
X

Mahesh Babu: త్వరలో మళ్లీ పట్టాలు ఎక్కనున్న మహేష్ బాబు సినిమా షూటింగ్

Mahesh Babu - Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమా అయిన "సర్కారు వారి పాట" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మహానటి సినిమా ఫేమ్ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా రాజకీయ బ్యాక్ డ్రాప్తో సాగుతుంది.

ప్రస్తుతం మహేష్ బాబు ఈ మధ్యనే మోకాలు సర్జరీ చేయించుకున్న తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా షూటింగ్ కూడా పాజ్ లోకి వెళ్ళింది. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మళ్లీ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

ఇంకా 45 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందట. అంటే చిత్ర ఆఖరి షెడ్యూల్ ఫిబ్రవరి లో మొదలు కాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మరియు జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సముతిరఖని, సుబ్బరాజు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story