Mahesh Babu: కూతరు సితారతో కలిసి మహేష్ దంపతులు వైల్డ్ పార్టీ..

Mahesh Babu: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సూపర్ స్టార్ తాజాగా తన ఇస్టా అకౌంట్ ద్వారా తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి జరుపుకున్న పార్టీ ఈవెంట్ పిక్స్ ని షేర్ చేశాడు.

Dhatripriya
Updated on: 7 Jun 2023 2:00 PM IST
Mahesh Babu: కూతరు సితారతో కలిసి మహేష్ దంపతులు వైల్డ్ పార్టీ..
X

Mahesh Babu: కూతరు సితారతో కలిసి మహేష్ దంపతులు వైల్డ్ పార్టీ 

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రం చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ తో మహేష్ బాబు ఊర మాస్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి అంటే 2024 జనవరి 13న భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సూపర్ స్టార్ తాజాగా తన ఇస్టా అకౌంట్ ద్వారా తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి జరుపుకున్న పార్టీ ఈవెంట్ పిక్స్ ని షేర్ చేశాడు. శ్రీయా భూపాల్ బేబీ షవర్ పార్టీగా తెలుస్తుంది.

గుంటూరు కారం టైటిల్ కి తగ్గట్టు ఊర నాటు లుక్ లో కనిపించిన మహేష్ బాబు పార్టీ పిక్స్ లో మాత్రం చాలా నీటుగా హ్యాండ్సమ్ గా కనిపించడం విశేషం. అలాగే ఈ పిక్స్ లో మహేష్ బాబు స్టైలిష్ లుక్స్ లో అదరగొట్టగా ఆయనతోపాటు నమత్ర శిరోద్కర్, వారి ఫ్రెండ్స్ కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అంతేకాదు ఈ పిక్స్ లో సితారా కూడా కనిపించింది.

ఈ పిక్స్ లో మహేష్ బాబుకి ధీటుగా సితార మెరిసింది. సోషల్ మీడియాలో చరుగ్గా ఉండే సితారా ఓ ప్రముఖ జ్యూయలరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్ ని సితార ఇప్పటికే కంప్లీట్ చేసుకుంది. మహేష్ బాబు ఫ్యామిలీ పిక్స్ చూసిన ఫ్యాన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అభిమానులు వావ్ అంటుంటే మరికొంతమంది లవ్ యూ మహేష్ అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story