మళ్ళీ బుల్లితెరపై మహేష్ బాబు దూకుడు!

మళ్ళీ బుల్లితెరపై మహేష్ బాబు దూకుడు!
x
Highlights

Mahesh Babu : మహేష్ బాబు సినిమా అంటే ఉండే క్రేజే వేరు. వెండితెర మీద చూసిన సినిమా కూడా మళ్ళీ టీవీలో వస్తే వదిలిపెట్టారు. ఎన్నిసార్లు వచ్చినా చూస్తూనే ఉంటారు. తాజాగా సరిలేరు నీకెవ్వరూ సినిమా మూడోసారి బుల్లితెరపై సందడి చేసింది.

మహేష్ బాబు ఈ పేరులోనే వైబ్రేషన్ ఉంటుంది కదూ. అవును మహేష్ బాబు సినిమాలకు ఉండే క్రేజే వేరు. కొన్ని సినిమాలైతే ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూసేస్తుంటారు ప్రేక్షకులు. టీవీలో మహేష్ బాబు సినిమాల్లో అతడు సినిమాది ఒక ప్రత్యేకమైన రికార్డు. ఎన్నిసార్లు ఆ సినిమా బుల్లితెర మీద ప్రత్యక్షం అయిందో లెక్క చెప్పడం ఆ సినిమాని ప్రసారం చేసే మాటీవీ కె సాధ్యం కాని పని అంటే అతిశయోక్తి కాదు. ప్రసారమైన ప్రతిసారి అతడు టీఆర్పీ లను కొల్లగోడుతూనే ఉంటుంది.

ఇప్పుడు ఆ వరుసలో మహేష్ బాబు మరో సినిమా వచ్చి చేరింది. మహేష్ బాబునే కామెడీ ట్రాక్ లో ఇరికించేసి పోయిన సంక్రాంతికి ప్రేక్షకులకు చక్కిలిగిలి పెట్టేశారు అనీల్ రావిపూడి. సంక్రాంతి బరిలో సొమ్ములు కొల్లగొట్టింది ఈ సినిమా. ఈ సినిమాలో విజయశాంతి మరోసారి తన సత్తా నిరూపించారు. సరిలేరు నీకెవ్వరూ సినిమా మహేష్ బాబు కెరీర్ లో వచ్చిన మంచి సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది.

ఈ సినిమా బుల్లితెర హక్కులను జెమినీ టీవీ ఫ్యాన్సీ రేటు పెట్టి తీసుకుంది. టీవీ హక్కుల రేటింగ్ లో కూడా మహేష్ సరిలేరు నీకెవ్వరు రికార్డు సృష్టించింది. ఇక జెమినీ టీవీ ఈ సినిమాని మొదటిసారి లాక్ దౌన్ సమయంలో ప్రసారం చేసింది జెమిని. అప్పుడు ఆ సినిమా 23.4 టీఆర్పీ ఎగరేసుకుపోయింది. తెలుగు సినిమాలలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ వాచిన ప్రభాస్ బాహుబలి కన్నా ఎక్కువ రేటింగ్ సాధించి రికార్డ్ సృష్టించిందని నిర్మాతలు అప్పట్లో చెప్పారు. మళ్ళీ కొన్నాళ్ళ క్రితం ఈ సినిమాని జెమినీ రెండోసారి ప్రసారం చేసింది ఈసారి కూడా టాప్ టీఆర్పీ సాధించింది సరిలేరు నీకెవ్వరూ. ఈసారి 17.4 రేటింగ్స్ వచ్చాయి. దీంతో బొమ్మ దద్దరిల్లిపోయింది అంటూ మహేష్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. (రెండో ప్రసారంలో ఈ స్థాయి రేటింగ్ రావడం కూడా ఈ సినిమాకే) ఇక మొన్న ముచ్చటగా మూడోసారి మళ్ళీ ప్రసారం చేసింది ఈ సినిమాని జెమినీ. ఈసారి మహష్ బాబు కుమ్మేశాడు. 11.19 రేటింగ్స్ తో కొత్త సినిమాలకు వచ్చే టీఆర్పీ రేటింగ్ వచ్చింది మూడోసారి.

ఈ రికార్డులతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. మహేష్ బాబు సినిమా అంటేనే నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ రికార్డులు సృష్టిస్తుంది.. అది పెద్ద తెర అయినా, బుల్లి తెర అయినా అంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు. మొత్తమ్మీద బుల్లితెర మీద కూడా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ! అనిపించుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories