Indira Devi: మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూత

Indira Devi: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి

Jyothi
Updated on: 28 Sept 2022 8:26 AM IST
Mahesh Babu Mother Passed Away
X

Indira Devi: మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూత

Indira Devi: ప్రముఖ సినీనటుడు మహేశ్‌బాబుకు మాతృవియోగం కలిగింది. సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌ తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, సూపర్‌స్టార్‌ అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఘట్టమనేని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

కృష్ణ- ఇందిరాదేవికి ఐదుగురు సంతానం. కుమారులు రమేశ్‌బాబు, మహేశ్‌బాబుతో పాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో పెద్దకుమారుడు రమేశ్‌బాబు అనారోగ్యంతో మృతిచెందారు. ఇప్పుడు ఇందిరాదేవి మృతితో మహేశ్‌ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుటుంబసభ్యులు, అభిమానుల సందర్శనార్థం ఇందిరాదేవి పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్‌ మహా ప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.

Jyothi

Jyothi

Next Story