Mahesh Babu: సెంటిమెంట్ కారణంగా దసరా బరి నుంచి తప్పుకున్న మహేష్ బాబు

Mahesh Babu: త్రివిక్రమ్ తో సినిమా విషయంలో అక్టోబర్ సెంటిమెంట్ ఫాలో అవుతున్న మహేష్ బాబు

Dhatripriya
Updated on: 23 March 2023 8:30 PM IST
Mahesh Babu Left Dussehra Competition Due To Sentiment
X

Mahesh Babu: సెంటిమెంట్ కారణంగా దసరా బరి నుంచి తప్పుకున్న మహేష్ బాబు

Mahesh Babu: మన టాలీవుడ్ లో తమ సినిమాల విషయంలో సెంటిమెంట్లు ఫాలో అయ్యే వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ముందే ఉంటుంది. తాజాగా ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. #ఎస్ఎస్ఎంబీ28 అనే వర్కింగ్ టైటిల్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. మహేష్ బాబు కూడా కొన్ని సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు.

సినిమా లాంచ్ అయ్యే సమయంలో పూజా కార్యక్రమాలకు అందుకే దూరంగా ఉంటారు. తాజాగా ఇప్పుడు అలాంటి ఒక సెంటిమెంట్ కారణంగానే మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ తమ సినిమాని దసరా బరిలో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన "ఖలేజా" సినిమా కూడా అక్టోబర్ లోనే విడుదలైంది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మహేష్ బాబు హీరోగా నటించిన వంశీ, అతిధి, బాబి వంటి సినిమాలు కూడా అక్టోబర్ లోనే విడుదలయ్యాయి. కానీ అన్నీ సినిమాలు డిజాస్టర్లు గానే నిలిచాయి. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే సినిమాని కూడా అక్టోబర్లో విడుదల చేయకూడదని మహేష్ బాబు నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది జులై కల్లా సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృతం ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి. మరోవైపు మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story