అడవుల్లో షూటింగ్ చేస్తున్న మహేష్ బాబు

Ruthvik
Published on: 15 March 2019 12:21 PM IST
అడవుల్లో షూటింగ్ చేస్తున్న మహేష్ బాబు
X

ఒకవైపు సినిమాలతోనే కాకుండా మరో వైపు వాణిజ్య ప్రకటనలలో కనిపిస్తూ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. సినిమాలు మరియు ప్రకటనలతో భారీగా ఆర్జించే మహేష్ బాబు 30 నుంచి 40 కోట్ల వార్షికాదాయం సంపాదించే స్టార్ల జాబితాలో మహేష్ పేరు కూడా వినిపిస్తుంది. తాజాగా ఈ మధ్యనే మహేష్ ఒక ప్రముఖ కోలా బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా దక్షిణాఫ్రికాలో యాడ్ షూటింగ్ చేస్తున్నాడు. మహేష్ అక్కడి అడవిలో మరియు కొన్ని అరుదైన లొకేషన్లలో షూటింగ్ చేయనున్నాడు.

ఇక సినిమాల పరంగా కూడా అదే జోరు ని కనబరుస్తున్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ చిత్రంగా 'మహర్షి' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబు ఈ మధ్యనే 'ఎఫ్ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాను చేయనున్నాడు. 'మహర్షి', 'ఎఫ్ 2' లు నిర్మించిన దిల్ రాజు ఈ సినిమాను కూడా నిర్మించనున్నారు ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Ruthvik

Ruthvik

Next Story