సక్సెస్ మీట్ లో మహేష్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు

Mahesh Babu Key Comments in Sarkaru Vaari Paata Success Meet
x

సక్సెస్ మీట్ లో మహేష్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు

Highlights

Sarkaru Vaari Paata Success Meet: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన "సర్కారు వారి పాట" సినిమా తాజాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది.

Sarkaru Vaari Paata Success Meet: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన "సర్కారు వారి పాట" సినిమా తాజాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. తాజాగా ఈచిత్ర సక్సెస్ ఈవెంట్ ని సోమవారం నాడు కర్నూల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ, "ఒక్కడు షూటింగ్ టైంలో కర్నూల్ కి వచ్చాను. ఇప్పుడు మళ్లీ ఇలా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా విజయాన్ని కర్నూల్లో జరుపుకుందామని నిర్మాతలు చెప్పినప్పుడు చాలా సంతోషించాను. సినిమా చూసిన వెంటనే గౌతమ్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగిలించుకున్నాడు. ఈ సినిమాలో నువ్వు చాలా బాగా చేశావు నాన్న అని సితారా అంది" అన్నారు మహేష్ బాబు. పోకిరి, దూకుడు సినిమాల కంటే ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని వాళ్లు అన్నారు," అన్నారు మహేష్ బాబు.

"కరోనా కారణంగా సినిమా కోసం మేము రెండేళ్లు కష్టపడాల్సి వచ్చింది. కానీ సినిమా సక్సెస్ ని చూశాక ఆ కష్టం కనుమరుగైపోయింది. సినిమా కోసం పనిచేసిన సాంకేతిక నిపుణులు నిర్మాతలకు నా ధన్యవాదాలు. కీర్తి సురేష్, సముద్రఖని పాత్రలు సినిమాకి మరింత కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. తమన్ అందించిన కళావతి పాట కూడా అదిరిపోయింది" అని అన్నారు మహేష్ బాబు. ఇక ఈ చిత్ర దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ ఒక్కడు సినిమా చూసి దర్శకుడు కావాలనుకున్నానని అలాంటిది మహేష్ బాబు సినిమాకి దర్శకత్వం వహించటం, కర్నూల్ లో ఆ సినిమా సక్సెస్ మీట్ చేయటం జీవితకాల బహుమతి అన్నారు పరశురామ్.

Show Full Article
Print Article
Next Story
More Stories