సుమ ను రిక్వెస్ట్ చేస్తున్న మహేష్ బాబు

Mahesh Babu: కొత్త ఐడియాలు ఇవ్వద్దు అంటున్న మహేష్ బాబు

Rama Rao
Updated on: 10 May 2022 10:30 AM IST
Mahesh Babu is Requesting Suma | Telugu News
X

సుమ ను రిక్వెస్ట్ చేస్తున్న మహేష్ బాబు

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "సర్కారు వారి పాట". పరశురామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మహానటి బ్యూటీ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా మే 12న థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ప్రస్తుతం చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ఏ ఇంటర్వ్యూ అయినా ముందుగా మహేష్ బాబు ని అడుగుతున్న ప్రశ్న తన కూతురు సితార కనిపించిన 'పెన్నీ' పాట సినిమా లో ఉంటుందా లేదా అని.అయితే సితార కేవలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాత్రమే పాటలో కనిపించిందని ఆ పాట ఆ సినిమాలో ఉండదని మహేష్ బాబు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కనీసం ఆ పాటని సినిమా అయిపోయాక అయినా చేయొచ్చు కదా అని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాంకర్ సుమ మహేష్ బాబు ని అడిగింది.

"మీరు ఇప్పుడు ఇలా అడిగితే తను కూడా నేను ఎందుకు సినిమా లో లేను అని నన్ను అడుగుతుంది.ఇలా చేయొద్దు సుమ ప్లీజ్ ఆ పాట కేవలం ప్రమోషన్స్ కి మాత్రమే" అని నవ్వేశారు మహేష్ బాబు. ఇక ఇప్పటికే సినిమా ఫైనల్ ప్రింట్ ని అమెరికా తో పాటు మిగతా అన్ని ఏరియా లకి పంపించేశామని ఇప్పుడు ఇలాంటి కొత్త ఐడియాలు ఇవ్వద్దని అన్న మహేష్ బాబు కావాలంటే సితార పాటని డివిడి చేసి ఇంటికి పంపిస్తాను చూడండి అని సుమ తో అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story