#SSMB28: త్రివిక్రమ్ సినిమాలో రివెంజ్ తీర్చుకోబోతున్న మహేష్ బాబు

#SSMB28: మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా కథ రివెంజ్ డ్రామా జోనర్ లో ఉంటుందట

admin1
Updated on: 30 Aug 2021 3:02 PM IST
Mahesh Babu is Going to Take Revenge in the Trivikram Srinivas New Movie
X

రివెంజ్ డ్రామాగా రానున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమా (ఫైల్ ఇమేజ్)

#SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో "సర్కార్ వారి పాట" అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. "అతడు", "ఖలేజా" వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు మహేష్ బాబు కాంబో లో రాబోతున్న మూడవ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

#SSMB28 అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక రివెంజ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాలోని పాత్రలు చాలా ఇంటెన్స్ గా ఉంటాయి అని, రివెంజ్ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. "మహర్షి" సినిమాలో మహేష్ బాబుతో రొమాన్స్ చేసిన పూజ హెగ్డే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపించనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story