బాలకృష్ణ ను ఫాలో కాబోతున్న మహేష్ బాబు

Mahesh Babu is Going to Follow Balakrishna | Telugu Movie News
x

బాలకృష్ణ ను ఫాలో కాబోతున్న మహేష్ బాబు

Highlights

*బాలకృష్ణ ను ఫాలో కాబోతున్న మహేష్ బాబు

Mahesh Babu: "అఖండ" సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఆ సినిమాలో జై బాలయ్య పాట కూడా అంతే పెద్ద హిట్ అయింది. కేవలం నందమూరి అభిమానులు మాత్రమే కాక మిగతా వారు కూడా "జై బాలయ్య" అంటూ రాగాలు తీయడం మొదలుపెట్టారు. "జై బాలయ్య" అనే మాటని బోయపాటి శ్రీను అఖండ సినిమాతో ఒక సెన్సేషన్ గా మార్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మరొక స్టార్ హీరో ఈ ట్రెండ్ని ఫాలో కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. పరుశురాం డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా "సర్కారు వారి పాట" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.కీర్తి సురేష్ కి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన ఒక పాట షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుందని తెలుస్తోంది.

జై బాలయ్య లాగా "మా మా మా మహేష్" అంటూ ఈ పాట సాగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాట తో మహేష్ బాబు పేరు ఎలివేట్ అవుతుందని దర్శక నిర్మాతలు ఇలా ప్లాన్ చేశారు. ఒక పక్కా మాస్ పొలిటికల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. ఈ పాట గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories