Mahesh: పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి రెడీ అయిన రాజకుమారుడి ఫ్యాన్స్

Sandeep Reddy
Published on: 8 Aug 2021 8:10 PM IST
Mahesh Babu Huge Fans Ready to Plant Sapling on His Birthday Tomorrow  9 August 2021
X

మహేష్ బాబు (ట్విట్టర్ ఫోటో)

Mahesh Babu: ఘట్టమనేని నట వారసుడుగా టాలీవుడ్ లో "రాజకుమారుడు"గా ఎంట్రీ ఇచ్చి అమ్మాయిల మనసులో "యువరాజు"గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ తో తన "దూకుడు" చూపించే ప్రిన్స్ మహేష్ బాబు పుట్టిన రోజును అభిమానులు ఆగష్టు 9 న "బ్రమ్మోత్సవం"లా జరుపుకోడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా తన పుట్టిన రోజును అభిమానులు ఒక్కొక్కరు 3 మొక్కలను నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మద్దతుగా నిలవాలని మహేష్ అభిమానులకు ప్రత్యేకంగా కోరారు. ఇక తన పుట్టినరోజును "సర్కార్ వారి పాట" సినిమా షూటింగ్ లో భాగంగా మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి గోవాలో జరుపుకోనున్నట్లు తెలుస్తుంది.

రేపు జరగబోయే మహేష్ పుట్టినరోజును అభిమానులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడటంలో పాత్ర పోషిస్తూనే తమ అభిమానంతో ప్రిన్స్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి అభిమానులు సిద్ధంగా ఉన్నారు. మరోపక్క మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగష్టు 9న "సర్కార్ వారి పాట" సినిమా టీజర్ ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేయనున్నట్లు సమాచారం.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story