Evaru Meelo Koteeswarulu: పూనకాల ఎపిసోడ్ లోడింగ్.. అతిథిగా మహేష్ బాబు

Mahesh Babu Guest in Evaru Meelo Koteeswarulu  Reality Game Show
x

Evaru Meelo Koteeswarulu: పూనకాల ఎపిసోడ్ లోడింగ్.. అతిధిగా మహేష్ బాబు

Highlights

Mahesh Babu - NTR: ఒక ప్రముఖ ఛానెల్ లో ప్రసారమయ్యే "ఎవరు మీలో కోటీశ్వరులు" రియాలిటీ గేమ్ షోలో ప్రిన్స్ మహేష్ బాబు అతిధిగా పాల్గొననున్నారు. ఇప్పటికే...

Mahesh Babu - NTR: ఒక ప్రముఖ ఛానెల్ లో ప్రసారమయ్యే "ఎవరు మీలో కోటీశ్వరులు" రియాలిటీ గేమ్ షోలో ప్రిన్స్ మహేష్ బాబు అతిధిగా పాల్గొననున్నారు. ఇప్పటికే హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరిస్తున్న ఈ షోకి రామ్ చరణ్, సమంత అతిధులుగా పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా మహేష్ బాబు కూడా బుల్లితెర రియాలిటీ షోలో కనిపించనుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మహేశ్‌ బాబు - యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇద్దరు కలిసి ఎవరు మీలో కోటిశ్వరులు షోలో సందడి చేయనున్నారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ అతి త్వరలో ప్రసారం కానుంది.

తాజాగా ఈ షోలో ఇద్దరూ పాల్గొన్న ఒక పోస్టర్‌ను "ఎవరు మీలో కోటీశ్వరులు" టీం పోస్ట్‌ చేసింది. పూనకాల ఎపిసోడ్‌ లోడింగ్‌ అంటూ టైటిల్ ని కూడా జోడించింది. ఈ పోస్టర్ ని చూసిన నెటిజన్లు మాత్రం ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ప్రిన్స్ మహేశ్‌ బాబు - యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై ఒకే షోలో కనిపించనుండటంతో ఈ ఒక్క ఎపిసోడ్‌తో 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు టీఆర్పీ రేటింగ్‌ భారీగా పెరిగే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories