టాప్ లో మహేష్.. చివర్లో చిరు!

టాప్ లో మహేష్.. చివర్లో చిరు!
x
Highlights

అయితే ఈ జాబితాలో టాప్ వన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచాడు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, విజ‌య్, ఎన్టీఆర్, సూర్య ఉన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవికి 10 వ స్థానం దక్కింది

మరికొన్ని రోజుల్లో 2020 సంవత్సరానికి శుభంకార్డు పడనుంది. ఈ సందర్బంగా ట్విట్ట‌ర్ సినిమా సెల‌బ్రిటీలు, క్రికెట‌ర్స్, రాజ‌కీయ నాయ‌కులు మరియి ఇతర రంగానికి సంబంధించిన టాప్ 10 జాబితాను విడుదల చేస్తాయి. తాజాగా ట్విట్ట‌ర్‌లో సౌత్ సెల‌బ్రిటీల‌లో ఎవ‌‌రి గురించి ఎక్కువ‌ చ‌ర్చ జ‌రిగింద‌నే దానికి సంబంధించి లిస్ట్ ని అనౌన్స్ చేసింది." మీరందరూ ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది!2020 లో ఎక్కువగా ట్వీట్ చేయబడిన దక్షిణ భారత సూపర్ స్టార్స్ " అంటూ జాబితాను రిలీజ్ చేసింది.అయితే ఈ జాబితాలో టాప్ వన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచాడు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, విజ‌య్, ఎన్టీఆర్, సూర్య ఉన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవికి 10 వ స్థానం దక్కింది. అటు హీరోయిన్‌ల విష‌యానికి వచ్చేసరికి టాప్ వ‌న్ లో కీర్తి సురేష్ ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో కాజల్, సమంత, రష్మిక, పూజా హేగ్దే ఉన్నారు. ఇక 10 వ స్థానంలో త్రిష ఉన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories