Mahesh Babu - Rajamouli: రాజమౌళి తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన మహేష్

Mahesh Babu - Rajamouli: * ఈ సినిమా ఒక మ్యాసివ్ ప్రాజెక్ట్ అని అన్నారు మహేష్ బాబు

admin1
Updated on: 26 Oct 2021 3:35 PM IST
Mahesh Babu Gave Clarity on his New Movie with Director SS Rajamouli | Tollywoodm News Today
X

రాజమౌళి - మహేష్ బాబు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Mahesh Babu New Movie With Rajamouli: మహేష్ బాబు ఇప్పుడు పరశురామ్ దర్శకత్వంలో "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజమౌళి సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు మహేష్ బాబు.

రాజమౌళి తో చేయబోతున్న సినిమా గురించి మాట్లాడుతూ మహేష్ బాబు తాను చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని చెప్పారు. రాజమౌళి గారి లాంటి డైరెక్టర్ తో సినిమా చేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. కానీ ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడానికైనా ఇంకా చాలా సమయం ఉంది.

కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను ఈ సినిమా ఒక మ్యాసివ్ ప్రాజెక్ట్ అని అన్నారు మహేష్ బాబు. సినిమా కథ గురించి బోలెడు పుకార్లు బయటకి వచ్చాయి కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదు అని విజయేంద్రప్రసాద్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

admin1

admin1

Next Story