హిందీ చిత్రసీమను తక్కువచేసి మాట్లాడాలనే ఉద్ధేశం లేదు : మహేశ్ బాబు

Mahesh Babu: తెలుగు సినిమాల్లో నటించేందుకే సమయం సరిపోనందువల్లే బాలీవుడ్‌పై దృష్టిసారించలేదని...

Shireesha
Published on: 11 May 2022 5:43 PM IST
Mahesh Babu Gave Clarity about Comments on Bollywood Entry | Tollywood Latest News
X

హిందీ చిత్రసీమను తక్కువచేసి మాట్లాడాలనే ఉద్ధేశం లేదు : మహేశ్ బాబు

Mahesh Babu: తెలుగు సినిమాల్లో నటించేందుకే సమయం సరిపోనందువల్లే బాలీవుడ్‌పై దృష్టిసారించలేదని టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు స్పష్టంచేశారు. సర్కారువారిపాట సినిమా విడుదల నేపథ్యంలో బాలీవుడ్ ఎంట్రీపై వచ్చిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు పెడర్థాలతో కాంట్రావర్సీ అయిందని తెలిపారు.

తెలుగుసినిమాలోనే ఎక్కువ సినిమాల్లో నటించాలనే అభిలాష ఉందేతప్ప... పరభాషా చిత్రాల్లో నటించే సమయంలేదని మహేశ్ స్పష్టంచేశారు. తెలుగు సినిమాల్లో నటించడానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తాను తప్ప... హిందీ చిత్రసీమను తక్కువచేసి మాట్లాడాలన్న ఆలోచనే లేదన్నారు.

Shireesha

Shireesha

Next Story