Krishna Death: మహేశ్‌ బాబు గొప్ప మనసు.. బాధలోనూ అభిమానుల కోసం..

Krishna Death: మహేశ్‌ బాబు గొప్ప మనసు.. బాధలోనూ అభిమానుల కోసం..

Arun Chilukuri
Published on: 16 Nov 2022 7:21 PM IST
Mahesh Babu Food Arrangements To All Super Star Fans
X

Krishna Death: మహేశ్‌ బాబు గొప్ప మనసు.. బాధలోనూ అభిమానుల కోసం..

Krishna Death: అభిమానుల కన్నీటి నివాళులు... ప్రముఖుల సంతాపం... కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య... తెలుగు ప్రజల అభిమాన హీరో, సూపర్ స్టార్‌ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తమ అభిమాన నటుడు కృష్ణను కడసారి చూసేందుకు దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది అభిమానులు నగరానికి వచ్చారు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులర్పించాలని పడిగాపులు పడ్డారు.

కొందరికి అవకాశం లభించగా మరికొందరు కృష్ణ పార్థివ దేహాన్ని చూడలేకపోయారు. ఇలాంటి విషాద సమయంలోనూ మహేశ్ బాబు తన గొప్ప మనసును చాటుకున్నారు. సూపర్‌ కృష్ణ కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. అభిమానులందరికీ ఆయన భోజన ఏర్పాట్లు చేశారు. ఆయన విషాదంలో ఉన్నా మా ఆకలి తీర్చారు అంటూ పలువురు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story