Mahesh Babu: లండన్ కు మహేష్ బాబు.. ఈసారి కొడుకు భవిష్యత్ కోసం..

Mahesh Babu: ఈ మధ్యనే "సర్కారు వారి పాట" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు..

Arun Chilukuri
Updated on: 16 July 2022 7:01 PM IST
Mahesh Babu Flying To London For Gautam
X

Mahesh Babu: లండన్ కు మహేష్ బాబు.. ఈసారి కొడుకు భవిష్యత్ కోసం..

Mahesh Babu: ఈ మధ్యనే "సర్కారు వారి పాట" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు వెకేషన్ కి వెళ్ళనున్నారు. సినిమా సినిమాకి మధ్య ఉన్న గ్యాప్ లో వెకేషన్ కి వెళ్లే మహేష్ బాబు ఈసారి కూడా ఒక చిన్న ట్రిప్ కి వెళ్ళబోతున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ట్రిప్ వెనుక ఒక కారణం కూడా ఉందని తెలుస్తోంది. గత కొంతకాలంగా మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ ఘట్టమనేని కోసం ఫారిన్ లో మంచి స్కూల్స్ ను వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలోని మహేష్ బాబు మరియు తన భార్య నమృత కలిసి అమెరికాలో పెద్ద స్కూల్ ని కూడా చూసి అడ్మిషన్ గురించిన విషయాలను కనుక్కొని వచ్చారట. ఒక ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ కొడుకు కూడా అదే స్కూల్లో చదువుతున్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో లండన్ కి వెళ్లి అక్కడ ఒక స్కూల్ క్యాంపస్ ను చూడబోతున్నారట. గౌతమ్ ని లండన్ లోని మంచి స్కూల్ కి పంపిస్తే తన కరియర్ బాగుంటుంది అని మహేష్ బాబు అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల్లో మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో లండన్ కి పయనమవ్వనున్నారు. అక్కడి స్కూల్లో గౌతమ్ ను చేర్చిన తర్వాత మళ్లీ మహేష్ బాబు హైదరాబాద్ కి తిరిగిరానన్నారు. ఆగస్టు 9 తన పుట్టినరోజు జరుపుకున్న తర్వాత గౌతమ్ లండన్ లోని తన స్కూల్ కి వెళ్లబోతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story