తమన్ కంటే దేవిశ్రీప్రసాద్ బెటర్ అంటున్న నెటిజన్లు

Sarkaru Vaari Paata: వరుస చార్ట్ బస్టర్ పాటలతో కరీర్ లో ముందుకు దూసుకుపోతున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్.

Arun Chilukuri
Updated on: 13 May 2022 9:30 PM IST
Mahesh Babu Fans Not Happy With SS Thaman Music
X

తమన్ కంటే దేవిశ్రీప్రసాద్ బెటర్ అంటున్న నెటిజన్లు

Sarkaru Vaari Paata: వరుస చార్ట్ బస్టర్ పాటలతో కరీర్ లో ముందుకు దూసుకుపోతున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్. అయితే ఈ మధ్యనే మహేష్ బాబు హీరోగా విడుదలైన "సర్కారు వారి పాట" సినిమాతో మాత్రం తమన్ అంతగా మెప్పించలేకపోయారు. తమన్ సంగీతం ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. తమన్ ఈ సినిమాకి అందించిన నేపథ్య సంగీతం కానీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కళావతి, పెన్నీ పాటలు తప్ప ఈ సినిమాలో అంతగా గుర్తుండిపోయే పాటలు కూడా ఏదీ లేదు.

గతంలో మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు మరియు ఆగడు సినిమాలకి తమన్ సంగీతాన్ని అందించారు. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత మహేష్ బాబు సినిమాకి సంగీత దర్శకుడిగా ఎంపికైన తమన్ ఈసారి మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయ్యారని చెబుతున్నారు. ఇక ఈ సినిమా కోసం తమన్ కంటే దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఎంచుకుంటే బాగుండేది అని మరి కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు తమన్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకి కూడా సంగీతాన్ని అందిస్తున్నారు. మరి తమన్ ఈ సినిమాకి అయినా మంచి సంగీతాన్ని అందిస్తారో లేదో చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story