Mahesh Babu Emotional: అమ్మ చేతి కాఫీ.. నాకు దేవుడి ప్రసాదంతో సమానం..

Mahesh Babu Mother: ప్రముఖ సినీనటుడు మహేశ్‌ బాబుకు మాతృవియోగం కలిగింది.

Arun Chilukuri
Published on: 28 Sept 2022 11:31 AM IST
Mahesh Babu Emotional Video About Her Mother
X

Mahesh Babu Emotional: అమ్మ చేతి కాఫీ.. నాకు దేవుడి ప్రసాదంతో సమానం..

Mahesh Babu Mother: ప్రముఖ సినీనటుడు మహేశ్‌ బాబుకు మాతృవియోగం కలిగింది. సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌ తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, సూపర్‌స్టార్‌ అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఘట్టమనేని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

కృష్ణ- ఇందిరాదేవికి ఐదుగురు సంతానం. కుమారులు రమేశ్‌ బాబు, మహేశ్‌ బాబుతో పాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో పెద్దకుమారుడు రమేశ్‌బాబు అనారోగ్యంతో మృతిచెందారు. ఇప్పుడు ఇందిరాదేవి మృతితో మహేశ్‌ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మహేశ్‌కు తల్లి ఇందిరా దేవిపై అపురూపమైన ప్రేమ. పలు సందర్భల్లో ఆమె ప్రస్తావన రాగానే ఎంతో ఎమోషనల్ అయ్యాడు. పెళ్లికిముందు వరకు ఆయన తల్లి చాటునే పెరిగాడు. అందుకే ఆమె అంటే అంత ప్రేమ. మహేశ్‌బాబు తన తల్లి ఇందిరా దేవి గురించి మాట్లాడిన మాటలు. బుధవారం తెల్లవారుజామున ఇందిరా దేవి మరణంతో ఈ వీడియోను సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.

''నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఏ సినిమా రిలీజైనా ముందు అమ్మ దగ్గరికి వెళ్లి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్టు ఉంటుంది. ఆమె ఆశీస్సులు నాకెప్పటికీ ముఖ్యం. ఆమె ఆశీస్సుల వల్లే నాకు ఈ విజయం వచ్చింది''.. ఇవి 'మహర్షి' సక్సెస్‌ మీట్‌లో మహేశ్‌బాబు తన తల్లి ఇందిరా దేవి గురించి మాట్లాడిన మాటలు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story